డాక్టర్స్ జీన్స్ వేయెద్దు..మేకప్,నగలు వేసుకోవద్దు

డాక్టర్స్ జీన్స్ వేయెద్దు..మేకప్,నగలు వేసుకోవద్దు

హర్యానా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం వేసుకోవాలని ఆదేశించింది. స్పెషల్ డ్రెస్ కోడ్.. రోగులకు, సిబ్బంది, వైద్యుల మధ్య తేడాను గుర్తించడాన్ని సులభతరం చేస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వైద్యులు, సిబ్బంది .. డెనిమ్ జీన్స్, పలాజో ప్యాంట్లు, బ్యాక్‌లెస్ టాప్స్, స్కర్ట్‌లు ధరించి ఆసుపత్రులకు రావడంపై నిషేధం విధించింది. ఇక మహిళా వైద్యులు మేకప్ వేసుకోవడాన్ని, బరువైన ఆభరణాలు ధరించడంతో పాటు, తమ గోళ్లను పొడవుగా పెంచడాన్ని కూడా బ్యాన్ చేసింది. పురుషులు తమ జుట్టును షర్ట్ కాలర్ కంటే పొడవుగా పెంచవద్దని సూచించింది.   

వైద్యులు ఎవరూ చెమట కనిపించే చొక్కాలు, డెనిమ్ స్కర్టులు, షార్ట్‌లు, స్ట్రెచబుల్ టీ-షర్టులు లేదా ప్యాంట్‌లు, బాడీ హగ్గింగ్ ప్యాంట్‌లు, నడుము వరకు ఉండే టాప్‌లు, స్ట్రాప్‌లెస్ టాప్‌లు, బ్యాక్‌లెస్ టాప్‌లు, క్రాప్ టాప్‌లు, డీప్-నెక్ టాప్‌లు, ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌లు, స్నీకర్లను కూడా ధరించకూడదని ఆదేశించింది. అయితే ఈ పాలసీ డే టైంలోనే కాదు.. నైట్ షిఫ్టుల్లో ఉండే వారికి, వీకెండ్స్ లో డ్యూటీ చేసేవారికీ వర్తిస్తుందని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. ప్రొఫెషనల్‌గా కన్పించే ఫార్మల్‌ దుస్తులనే ధరించాలన్న ఆయన... ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.