గర్భగుడిలోకి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ తప్పని సరి

గర్భగుడిలోకి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ తప్పని సరి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి నగరంలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించే భక్తుల కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టాలని కాశీ విద్వత్ పరిషత్ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం గర్భగుడిలోకి ప్రవేశించే పురుషులు భారతీయ హిందూ సంప్రదాయ వస్త్రధారణ అయిన ధోతీ,కుర్తా, మహిళలు చీరలు ధరించాలని నిర్ణయించింది. గర్భగుడిలోకి ప్రవేశించడానికి భక్తులకు ఉదయం 11 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించారు. ఈ కొత్త డ్రెస్ కోడ్ నిబంధన అమలు చేసే తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

ప్యాంటు, చొక్కాలు, జీన్స్ ధరించిన వ్యక్తులు దూరం నుంచి పూజలు చేయవచ్చు.అయితే మాత్రం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించరు. 2019లో ప్రధాని మోడీ కాశీ ఆలయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాశీకి ప్రపంచ గుర్తింపు ఇచ్చేలా గంగానదితో ఆలయాన్ని అనుసంధానం చేయనున్నారు.