'వేణు యెల్డండి'.. (Venu Yeldandi) ఈ పేరులో ఓ అరుదైన మట్టివాసన ఉందని తన ఫస్ట్ మూవీతోనే నిరూపించాడు. బలగం (Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకుని తన సత్తా చాటాడు. ఈ క్రమంలోనే తన రెండోమూవీ కూడా స్వచ్ఛమైన పల్లెటూరు కథాంశంతో తెరకెక్కుతోందని వెల్లడించి అంచనాలు పెంచాడు. నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఊరి గ్రామదేవతైన ‘ఎల్లమ్మ’పేరు పెట్టుకుని మరింత ఆసక్తి కలిగేలా చేశాడు వేణు.
అయితే, ఈ సినిమాలో వరుసగా హీరోలు మారుతున్నారు. ఈ కథకి ముందుగా హీరో నాని నటిస్తున్నట్లు ముందునుంచి టాక్ వినిపించింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకి వెళ్ళింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ పేరు కూడా వినిపించినప్పటికీ అది కేవలం ఊహాగానాలకే పరిమితమైంది. అప్పుడప్పుడు పలువురు తమిళ హీరోల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
ఇక మొన్నటికీ మొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది. ఎంతలా అంటే.. దేవిశ్రీ అలోమోస్ట్ ఫిక్స్ అయ్యాడని టాక్ వినిపించింది. కానీ, ‘ఎల్లమ్మ’ లో దేవిశ్రీ ప్రసాద్ నటించడం లేదని లేటెస్ట్ టాక్. దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ కథ వినింది కేవలం మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమేనని సినీ వర్గాల సమాచారం.
ఈ క్రమంలో ఎల్లమ్మలో నటించే హీరోపై మరోసారి సస్పెన్స్ నెలకొంది. అయితే, వేణు ఇప్పటికే రంగస్థల కళాకారులను కూడా ఎంపిక చేసి వారితో ప్రత్యేక రిహార్సల్స్ కూడా చేయిస్తున్నాడు. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
ఇకపోతే, ఈ సినిమాకు గ్రామదేవత పేరైన ‘ఎల్లమ్మ’అని టైటిల్ ఫిక్స్ చేసుకోవడంతోనే వేణు సక్సెస్ అయ్యాడు. ఇక అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఆధ్యాత్మికం, తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాడంటే వేణు మిగతా భాగం గెలిచినట్లే. ఎందుకంటే తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ చేరువయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. అయితే, ఎంత వీలైతే అంత త్వరగా ఎల్లమ్మలో నటించే హీరో, హీరోయిన్ ప్రకటించాలని ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆడియన్స్ కి రిక్వెస్ట్ కాస్తా కోపంగా మారకముందే అనౌన్స్ చేయాలని మరికొందరు భావిస్తున్నారు.
Jai hanuman 🙏🙏#jaihanuman #yellamma #cinema #dreams #culture pic.twitter.com/xoVEK7XHw9
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 20, 2025
