బాన్సువాడ, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రతి పోలింగ్ సెంటర్లవద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ రాజేశ్చంద్ర పోలీస్అధికారులకు సూచించారు. బుధవారం బాన్సువాడ పోలింగ్సెంటర్తోపాటు పరిసర ప్రాంతాలను పరిశీలించి డీఎస్పీతో చర్చించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ విట్టల్ రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సైలు ఉన్నారు.
