రాంపూర్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్ వద్ద బస్సులో  రూ.28 లక్షలు సీజ్

 రాంపూర్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్ వద్ద బస్సులో  రూ.28 లక్షలు సీజ్

ఆదిలాబాద్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బుధవారం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ.28 లక్షల నగదు పట్టుబడింది. ఆదిలాబాద్​ శివారులోని రాంపూర్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా, ప్రయాణికుడు సుభాష్ కేశవ్ బ్యాగులో రూ.28 లక్షలు గుర్తించారు.

నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదును పత్రాలు లేకుండా తరలిస్తే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జీవన్ రెడ్డి, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.