బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్‌‌‌‌ జాగ్రత్తగా చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి   

బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్‌‌‌‌ జాగ్రత్తగా చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి   

నిజామాబాద్, వెలుగు : ఎలాంటి తప్పులు   దొర్లకుండా జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్స్‌‌‌‌ ప్రింటింగ్ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థను ఆమె సందర్శించి, పోలింగ్ ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ దిలీప్‌‌‌‌కుమార్‌‌‌‌తో చర్చించారు. బ్యాలెట్ పేపర్స్​తో పాటు పోస్టల్ బ్యాలెట్లను కూడా ప్రింటింగ్‌‌‌‌లో చేర్చాలని సూచించారు.  బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్లను ముద్రించి స్ట్రాంగ్ రూమ్‌‌‌‌కు తరలించాలని తెలిపారు.

ప్రింటింగ్ పూర్తైన అనంతరం సాఫ్ట్ కాపీలను హార్డ్​డిస్క్​ల నుంచి పూర్తిగా తొలగించేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌‌‌‌క్యాస్టింగ్ నిర్వహిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను ముందుగానే పరిశీలించాలని, పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్​లను కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రానికి తరలించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ పాల్గొన్నారు