- ఇండిపెండెంట్ అభ్యర్థిపై కేసు
కోల్‌బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన అల్జా చంద్రయ్య ఇంట్లో రూ.96,228 విలువైన మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణాపూర్ టౌన్ ఎస్సై జె.శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి చంద్రయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించి మద్యం బాటిల్స్‌ను గుర్తించారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఇండిపెండెంట్అభ్యర్థి గొల్లపల్లి మహేందర్మద్యం బాటిల్స్‌ను దాచినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం స్వాధీనం చేసుకొని మహేందర్, చంద్రయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బెల్ట్‌షాప్‌పై దాడి
మరోవైపు గద్దెరాగడి సాయికుటీర్ ప్రాంతంలో బొమ్మ మొగిలి నిర్వహిస్తున్న బెల్ట్‌షాప్‌పై దాడి చేసి రూ.2,254 విలువైన మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నామని, నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
