చెరువు కట్టపై తుపాకీతో కాల్చుకుని..సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

చెరువు కట్టపై తుపాకీతో కాల్చుకుని..సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి  జిల్లా మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.  నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ కి చెందిన సందీప్ ఏడాదిగా సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో నవంబర్ 3న చెరువు కట్టపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

అయితే సందీప్  వ్యక్తిగత సమస్యలతోనే  ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కానిస్టేబుల్ సందీప్  ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈకేసు వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు ఎస్పీ పరితోష్ పంకజ్.

వారం రోజుల క్రితం కామారెడ్డిలో  ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.