టీమిండియా ఓపెనర్ ప్రతీక రావల్ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్, ఫైనల్ కు గాయం కారణంగా దూరమైంది. లీగ్ మ్యాచ్ ల్లో ఎంతో నిలకడగా రాణించిన ప్రతీక నాకౌట్ మ్యాచ్ లకు దూరం కావడంతో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అయితే రావల్ కు రీప్లేస్ గా వచ్చిన షెఫాలీ వర్మ అద్భుతంగా రాణించింది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఆదివారం (నవంబర్ 2) సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంతో మన ప్లేయర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సెలెబ్రేషన్ లో భాగంగా ప్రతీక రావల్ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది.
గాయంతో వీల్ చైర్ లో ఉన్న ప్రతీకను జట్టు మర్చిపోలేదు. క్రచెస్‌పై ఉంటూనే సెలెబ్రేషన్ చేసుకుంది. వీల్‌చైర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని తన చుట్టూ వేసుకుని, ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన.. రావల్ క్రచెస్ తో ఉన్నప్పటికీ పోడియం మీదకు తీసుకొని వచ్చి విజయానందాన్ని పంచుకుంది. మనసుకు ఎంతగానో హద్దుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ లు మాత్రమే ఆడిన ప్రతీక రావల్ నిలకడగా రాణించింది. మ్యాచ్ లాడిన ఈ టీమిండియా ఓపెనర్ 51.33 యావరేజ్ తో 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో సెంచరీ చేసి సత్తా చాటింది.
ఏం జరిగిందంటే..?
ఆదివారం (అక్టోబర్ 26) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ప్రతీకాకు ఇంజ్యూరీ అయ్యింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఆపబోయే క్రమంలో కాలు మలుసుని కిందపడింది. దీంతో గ్రౌండ్‌లోనే నొప్పితో ప్రతీకా విలవిలలాడింది. నొప్పితో బాధపడుతున్న ప్రతీకా సహాయక సిబ్బంది సహాయంతో మైదానం వీడింది. గాయం తీవ్రతతో ఎక్కువగా ఉండటంతో ప్రతీకా బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. దీంతో అమన్ జోత్ కౌర్‌తో కలిసి ఓపెనర్ స్మృతి మందాన ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లో షెఫాలీ వర్మ, స్మృతి మందాన కలిసి ఇండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.
►ALSO READ | World Cup 2025 Final: ఓడినా నువ్వే టాప్: సౌతాఫ్రికా కెప్టెన్ అసాధారణ పోరాటం.. ఆల్‌టైం రికార్డ్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఇండియా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
Lucky Charm of india 🇮🇳 Team
— FTino (@FernadoTin10172) November 3, 2025
Remember the name " Pratika Rawal"#indwvssaw #CWC25 #INDvsSA #ICCWomensWorldCup2025 pic.twitter.com/PMTnO4cDnz
