శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 8కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్కు బిజినెస్ వీసాపై వచ్చిన వ్యక్తి నుంచి 4 కిలోల కొకైన్ సీజ్ చేశారు. మరోవైపు అంగోలా నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ నుంచి మరో 4 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ప్రకటించింది. నిందితులిద్దరూ సూట్ కేసులో డ్రగ్స్ను ప్యాక్ చేసి తీసుకురాగా.. అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ మార్కెట్లో రూ.80 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

వరుసగా రెండోసారి ‘నేషనల్ లీడ్ స్టేట్’గా తెలంగాణ

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి