ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఆరు నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంది. కరోన కారణంగా మార్చిలో జరగాల్సిన పరీక్షలను మేలో నిర్వహిస్తోంది ఇంటర్ బోర్డ్. పరీక్షలపై ఎలాంటి ఆందోళన వద్దనీ... విద్యార్థులు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఇంటర్ బోర్డ్ లేదా కాలేజీల ప్రిన్సిపాల్స్ ని సంప్రదించాలని కోరారు బోర్డ్ అధికారులు. రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 7 వేల 396 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రంలో గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయిస్తారు. కరోన నిభందనలు..ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు బోర్డ్ అధికారులు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేందుకు.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  
  
ఈ ఏడాది 70శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్. పరీక్షలంటే భయపడే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కాలేజీల యాజమాన్యాలు హాల్ టికెట్స్ ఇవ్వకుండా... ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే... ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ పై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదన్నారు జలీల్. ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన ఉందనీ... ప్రతి విద్యార్థీ టైంకు సెంటర్ కు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాయాలని సూచించారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి... అవి లేకుండా వస్తే సెంటర్లోనే ఇస్తారు. సమ్మర్ టైం కావడంతో ప్రతి పరీక్షా కేంద్రంలో తాగు నీరు..ఫ్యాన్లతో పాటు ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. అత్యవసర  వైద్య సేవలకు ఆశా వర్కర్లు, ANMలు కూడా ఎగ్జామ్స్ సెంటర్లలో ఉంటారు.  విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఎగ్జామ్స్ పూర్తయిన నెల రోజుల్లోనే ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్. 

SRH నుండి మరో క్రికెటర్ ఫేమస్.. అతని తండ్రి కూరగాయల వ్యాపారి

ఎఫ్ -3 ట్రైలర్ వచ్చేస్తుంది..!

రషీద్ ధమాకా

భగీరథ నీటిలో రొయ్యపిల్ల