పశ్చిమ జపాన్‌లో భారీ భూకంపం: 6.2 తీవ్రతతో వణికిన నగరాలు

పశ్చిమ జపాన్‌లో భారీ భూకంపం: 6.2 తీవ్రతతో వణికిన నగరాలు

వెస్ట్రన్ జపాన్ ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించింది. నార్త్ వెస్ట్రన్ జపాన్‌లోని షిమనే ప్రిఫెక్చర్ కేంద్రంగా ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

భూకంప కేంద్రం భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. షిమనే ప్రిఫెక్చర్ రాజధాని మాట్సుతో పాటు  టోటోరి ప్రిఫెక్చర్ పరిధిలోని పలు నగరాల్లో భూమి తీవ్రంగా కంపించింది.

భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. ఈ భూప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

 షిమనే అణు విద్యుత్ ప్లాంట్‌తో పాటు అక్కడి ప్రాంతంలోని ఇతర అణు కేంద్రాలను అణు నియంత్రణ అథారిటీ పరిశీలించి, ఎక్కడా ఎటువంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని చెప్పింది. 

 ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో జపాన్ ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్న...  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.