కేరళ రాష్ట్రంలో చికెన్ యుద్ధం నడుస్తుంది. సప్లయిర్స్, రిటైల్ వ్యాపారుల మధ్య ధరల మంటలు మండుతున్నాయి. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగటంపై.. జనం మౌనంగానే ఉన్నా.. వ్యాపారులు మాత్రం ఆందోళనకు దిగారు. అంతేనా.. ఏకంగా చికెన్ షాపులు మూసివేసి షాక్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళ రాష్ట్రంలో చికెన్ కిలో చికెన్ 290 రూపాయలకు చేరింది. 2025, నవంబర్ నెలలో కిలో చికెన్ 160 రూపాయలుగానే ఉంది. జస్ట్.. 45 రోజుల్లోనే ఏకంగా 290 రూపాయలకు పెరగటంపై అమ్మకాలు తగ్గిపోయాయి. ఫౌల్ట్రీ వ్యాపారులు, సప్లయిర్స్ ఒక్కసారిగా ధరలను పెంచటంపై చికెన్ షాపుల యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోజికోడ్ సిటీలో వ్యాపారులు ఏకంగా చికెన్ షాపులను మూసివేశారు. ధరలు తగ్గే వరకు షాపులు ఓపెన్ చేయమని తెగెసి చెప్పటంతో వ్యాపారులు షాక్ అయ్యారు. రమరికొన్ని ఏరియాల్లోనూ చికెన్ షాపులను స్వచ్ఛంధంగా మూసివేశారు వ్యాపారులు.
కిలో చికెన్ 200 నుంచి 220 రూపాయల వరకు అమ్మ వచ్చని.. అలా కాకుండా పంపిణీదారులు ఒకేసారి 290 రూపాయలు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు లోకల్ చికెన్ షాపు ఓనర్లు. 45 రోజుల్లోనే ఏం మారిందని.. ఇలా ధరలు పెంచాలని నిలదీస్తున్నారు. చికెన్ షాపులు మూసివేస్తున్న వ్యాపారులకు.. స్థానికుల నుంచి మద్దతు లభించటం విశేషం.
ALSO READ : మార్కెట్లలో 'ట్రంప్' టెన్షన్
రాష్ట్రంలో చికెన్ ధరల పెరుగుదల, లోకల్ చికెన్ షాపులు మూసివేతపై కేరళ పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. షాపులు మూసివేయొద్దని లోకల్ వ్యాపారులను కోరారు. దీనిపై వ్యాపారులు ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ధరలు తగ్గించే వరకు షాపులు ఓపెన్ చేసేది లేదని కోజికోడ్ సిటీలోని చికెన్ షాపు యజమానులు చెప్పటంతో.. అధికారులు సైతం చేతులెత్తేశారు.
కేరళ రాష్ట్రంలో జరిగే చికెన్ అమ్మకాల్లో 80 శాతం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. దీని వల్లే ధరలు అమాంతం పెరిగాయని చెబుతున్నారు పంపిణీదారులు. మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకురండి.. మేం మాత్రం 200 రూపాయలు అయితే అమ్ముతాం.. షాపులు ఓపెన్ చేస్తామని చెబుతుండటంతో.. పంపిణీదారులు సైతం ఆందోళనగా ఉన్నారు.
కేరళ ఇలా జరుగుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధర ఎంతైనా సరే.. చికెన్ ఎంత ధర పెరిగినా సరే.. తగ్గేదేలా అన్నట్లు తినేస్తున్నారు.
