TOXICTheMovie: యశ్ టాక్సిక్‌లో గ్లామర్ బూస్ట్.. ‘మెల్లిసా’ లుక్‌తో మైండ్ బ్లాక్ చేసిన రుక్మిణి

TOXICTheMovie: యశ్ టాక్సిక్‌లో గ్లామర్ బూస్ట్.. ‘మెల్లిసా’ లుక్‌తో మైండ్ బ్లాక్ చేసిన రుక్మిణి

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న లేటెస్ట్​ మూవీ ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ ట్యాగ్‌ లైన్‌. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ 2026 మార్చి 19న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. 

విడుదల దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. ఇప్పటికే కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ లుక్స్ రివీల్ చేసి సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ‘గంగ’ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా మరో క్రేజీ బ్యూటీని రంగంలోకి దింపుతూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘మెల్లిసా’ అనే పాత్రలో రుక్మిణి మోడ్రన్ డ్రస్‌లో పబ్‌లో నడుస్తూ కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆమె లుక్ పూర్తిగా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే, రుక్మిణి వసంత్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నిల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు, ఇటీవలే రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’లో ‘కనకవతి’ అనే కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మొత్తంగా చూస్తే, స్టార్ క్యాస్ట్‌, పవర్‌ఫుల్ లుక్స్‌, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో యశ్ ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ మరింత పెరుగుతున్నాయి.