రేపే (JAN 7న) మనశంకర వరప్రసాద్ మెగా ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు!

రేపే (JAN 7న) మనశంకర వరప్రసాద్ మెగా ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు!

మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సంక్రాంతి బరిలోకి వస్తున్నారు. అనిల్ రావిపూడి రూపొందించిన మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’(MSG) జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 11న ప్రీమియర్స్ పడనున్నాయి.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్స్‌ను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. వరుసగా ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, సాంగ్స్ అప్డేట్స్, ట్రైలర్ వంటి క్రేజీ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై హైప్‌ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు కావాల్సిన అసలైన ఘట్టాన్ని చూపించడానికి అనిల్ సిద్ధమయ్యారు.

లేటెస్ట్గా మన శంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘MSG’ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ రేపు బుధవారం, జనవరి 7న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుందని టీమ్ ప్రకటించింది. ఈ మెగా విక్టరీ వేడుక సాయంత్రం 5:30 గంటల నుండి ప్రారంభం కానుందని తెలిపింది. చిరు-వెంకీల స్పీచ్ కోసం, ఈ క్రేజీ స్టార్స్ స్టేజిపై చేసే హంగామా.. వంటి ఎంటర్టైన్మెంట్ చూడటానికి భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఈవెంట్‌తో సినిమాపై క్రేజ్ మరో స్థాయికి చేరనుంది. మొత్తంగా, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌కు MSG కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి.

ట్రాఫిక్ ఆంక్షలు.. రేపు (జనవరి 7) జరిగే MSG మెగా ప్రీ–రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో, శిల్పకళా వేదిక చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరించే అవకాశం ఉంది. ప్రధానంగా హైటెక్ సిటీ రోడ్ మరియు మాదాపూర్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించబడతాయి. సాధారణంగా, స్పెషల్ ఈవెంట్‌లు లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ విధమైన నియంత్రణలు వర్తించబడతాయి. చిరంజీవి, వెంకటేష్ వంటి బిగ్ స్టార్స్ నటిస్తున్న సినిమా అవ్వడంతో.. ఇరువురు ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది, అందువల్ల నగర వాసులు, డ్రైవర్లు.. ముందుగానే మార్గాలను ప్లాన్ చేసుకోవడం లేదా ప్రత్యామ్నాయ రూట్లను వాడటం మంచిది.