ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో జరిగిన జాతీయ స్థాయి రంగోత్సవ్ హ్యాండ్ రైటింగ్ , కలరింగ్ పోటీలలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు ప్రతిభ కనపరిచారు. పాఠశాలకు చెందిన వివిధ తరగతుల విద్యార్థులు 39 మంది జాతీయ పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. విజయం సాధించిన విద్యార్థులకు సోమవారం పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మెడల్స్ ను అందించారు.
ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాఠశాల విద్యార్థులు పలు రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయి పోటీలలో బహుమతులు సాధించి పాఠశాల ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. ఈ విద్యార్థుల అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
