
కల్వకుర్తి ప్రమాదంతో మిషన్ భగీరథపై ఎఫెక్ట్
నాగర్ కర్నూల్, వెలుగు: కల్వకుర్తి పంపుహౌస్ మునిగిపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ)కు నీటిని తరలించే ప్రక్రియకు పూర్తిగా బ్రేక్ పడింది. రెగ్యులర్‌గా కల్వకుర్తి ఫస్ట్ పంపుహౌస్ నుంచి 0.36 టీఎంసీ కెపాసిటీ ఉన్న ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి ఎల్లూరు డబ్ల్యూటీపీకి నీటిని తరలించి.. దాదాపు 19 అసెంబ్లీ సెగ్మెంట్లు, 3,008 ఆవాసాలకు మంచి నీళ్లు అందిస్తారు. కానీ ఇప్పుడు పంపుహౌస్ మునిగిపోవడంతో ఎల్లూరులోకి లిఫ్టింగ్ ఆగిపోయింది. పంపులు నడవడానికి రెండు, మూడు నెలలు పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో అప్పటిదాకా 19 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మంచినీటికి కొరత ఏర్పడనుంది. ఈ విషయం తెలియడంతో గ్రామాలు, పట్టణాల్లో జనం ఆందోళనలో పడ్డారు.
బోర్లు, ఇతర స్కీంలతో ఆల్టర్నేట్..
ఇప్పట్లో కల్వకుర్తి నీళ్లు వచ్చే చాన్స్ లేకపోవడంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో మంచినీళ్ల కోసం ఆల్టర్నేట్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. బోర్లలో మోటార్లు దింపి, రన్నింగ్ కండిషన్లో ఉంచుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్పంచులు, మున్సిపల్కమిషనర్లకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కల్వకుర్తి మూడో లిఫ్ట్ గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌కు సమీపంలో ఉన్న మిషన్ భగీరథ డబ్ల్యూటీపీకి వెంటనే పైప్లైన్లు వేసి నీటిని సరఫరా చేయాలని, అక్కడే నీళ్లను శుద్ధి చేసి ఊర్లకు సరఫరా చేయాలని భావిస్తున్నారు. గుడిపల్లిగట్టులో నీళ్లు తగ్గిపోతే జొన్నలబొగడ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే విషయమై చర్చిస్తున్నారు. మొత్తంగా మూడు వేల ఆవాసాలకు మంచి నీళ్లు అందక అవస్థలు నెలకొననున్నాయి.
For More News..