తాగే నీళ్లు ఇట్లనే ఉంటాయా..?

తాగే నీళ్లు ఇట్లనే ఉంటాయా..?

హయత్ నగర్, వెలుగు: తాగునీటిలో డ్రైనేజ్ నీరు కలుస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవడంలేదని  కార్పొరేటర్​ సామ తిరుమల్​రెడ్డి విమర్శించారు. నల్లాల్లో మురుగునీరు వస్తుందని అధికారుల దృష్టకి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు.  హయత్ నగర్ డివిజన్ లో మాల బస్తీలో తాగునీటి నల్లాల్లో  మురుగు నీరు  రావడంతో  బస్తీ వాసులు కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

అనుమగల్, శుభోదయ కాలనీ,అంబేడ్కర్ కాలనీ, మిధాని కాలనీ, గణేశ్​ నగర్ కాలనీలలో తక్కువ  ప్రెషర్ తో నీళ్లు వస్తున్నాయని స్థానికుల ఫిర్యదులను కూడా వాటర్​ వర్క్స్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కార్పొరేటర్​ వివరించారు.