వాడు.. వాడి పిచ్చి : 100 స్పీడ్లో పోలీస్ స్టేషన్లోకి దూసుకొచ్చిన కారు..

వాడు.. వాడి పిచ్చి : 100 స్పీడ్లో పోలీస్ స్టేషన్లోకి దూసుకొచ్చిన కారు..

ఓ వ్యక్తి..తన కారుతో అతి వేగంగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లాడు. అతను కావాలనే తన కారును పోలీస్ స్టేషన్ ను ఢీకొట్టాడు.  అయితే ఎంత పెద్ద వ్యక్తి అయినా..కావాలని చేసినా..పోలీస్ స్టేషన్ ను ఢీకొడితే కనీసం భయం..బెరుకు ఉంటుంది. కానీ ఈ వ్యక్తికి ఇసుమంతైనా భయం కానీ...వణుకు కానీ లేదు. పైగా పోలీస్ స్టేషన్ లోకి కారుతో దూసుకెళ్లిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూ జెర్సీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

న్యూ జెర్సీలోని ఓ పోలీస్ స్టేషన్ లోకి జాన్ హార్గ్రీవ్స్‌  అనే వ్యక్తి తన SUV కారుతో వేగంగా దూసుకెళ్లాడు.  కారు స్పీడ్ ధాటికి పోలీస్ స్టేషన్ లోని వస్తువులు ముక్కలు ముక్కలు అయ్యాయి. అయితే  ఈ సమయంలో పోలీసులు మరో గదిలో ఉన్నారు. కారు శబ్దాన్ని విని బయటకు వచ్చారు. పోలీసులను చూసిన నిందితుడు..రెండు చేతులు పైకెత్తి..ఏదో ఘన కార్యం చేసినట్లు సంబరాలు చేసుకున్నాడు. నేనే చేసినా..నేనే చేసినా అన్నట్లు రెండు చేతులతో పోలీసులకు సంతోషంగా తెలియజేశాడు. ఈ దృశ్యాలు పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 

ALSO READ : కారుపై పోరు!.. బరిలోకి ఓయూ విద్యార్థి నేతలు!

ఈ ఘటనపై న్యూ జెర్సీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని 34 ఏళ్ల జాన్ హార్గ్రీవ్స్‌ ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై దొంగతనం, వేధింపులు, తీవ్రమైన దాడి, నేరపూరిత దుశ్చర్య, చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం ఆయుధాలను కలిగి ఉండటం వంటి అనేక కేసులు నమోదయ్యాయి. అతనికి జీవిత ఖైదీ శిక్ష పడే అవకాశం ఉంది.