లారీని ఢీ కొట్టిన కారు…డ్రైవర్ పరిస్థితి విషమం

లారీని ఢీ కొట్టిన కారు…డ్రైవర్ పరిస్థితి విషమం

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ORR పై లారీ ని కారు ఢీకొట్టింది. కారు బలంగా లారీ ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో లారీ పూర్తి గా అగ్నికి ఆహుతి కాగా కారులో ఉన్న వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి.

రాజేంద్రనగర్ ఖలీజ్ ఖాన్ దర్గా దగ్గర ఇవాళ(ఆదివారం) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఏషియన్ పెయింటింగ్స్ డబ్బాల లోడుతో ఓ లారీ ORR మీదుగా బయలు దేరింది. అయితే ఇదే సమయంలో వెనకాలే వస్తున్న ఓ కారు అదుపు తప్పిన వేగంతో వచ్చి బలంగా లారీ ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి లారీ పూర్తి గా దగ్ధమైపోయింది. లారీ డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగా కారులో ఉన్న వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ORR  పెట్రోలింగ్ సిబ్బంది ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పి వేశారు. కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.