
రాష్ట్రంలో అక్కడక్కడా చినుకులు
కరీంనగర్లో 60 మి.మీ. వర్షం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. 20 ప్రాంతాల్లో మోస్తరు వానలు, దాదాపు 100 చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. కరీంనగర్ జిల్లాలోని వెల్దిలో ఎక్కువగా 60 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. జయశంకర్ భూపాల్లి జిల్లాలోని సర్వాయిపేటలో 44.3, రాజన్నసిరిసిల్ల జిల్లా అవునూరులో 33.8, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 30.8, ములుగులో 28 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు చినుకులు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.