సౌదీ అరేబియా ఎయిర్‌‌పోర్ట్‌పై డ్రోన్ అటాక్‌

సౌదీ అరేబియా ఎయిర్‌‌పోర్ట్‌పై డ్రోన్ అటాక్‌

సౌదీ అరేబియాలోని ఎయిర్‌‌పోర్టుపై మంగళవారం డ్రోన్ అటాక్ జరిగింది. ఈ ఘటనలో ఎనిమిదికి గాయాలయ్యాయి. ఒక విమానం డ్యామేజ్ అయింది. దీనికి సంబంధించిన న్యూస్ ఆ దేశపు ప్రభుత్వ మీడియాలో ప్రసారం అయింది.

సౌదీలో అభా ఎయిర్‌‌పోర్టుపై ఈ రోజు ఉన్నట్టుండి డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ దాడి చేసిందెవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ ఎయిర్‌‌పోర్టుపై డ్రోన్ అటాక్‌ జరగడం ఇది రెండోసారి. యెమెన్‌లో ఇరాన్ ప్రోద్బలంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన షియా రెబెల్స్‌పై సౌదీ నేతృత్వంలోని మిలటరీ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎయిర్‌‌పోర్టుపై పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్ అటాక్ చేసే సమయంలో దానిని ముందుగానే కూల్చేసేందుకు సౌదీ మిలటరీ ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే అది లోపలికి వచ్చేయడంతో ఎనిమిది మందికి గాయాలవడంతో పాటు ఒక ఫ్లైట్ డ్యామేజ్ అయిందని మిలటరీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం కూడా ఇలా రెండు డ్రోన్లు అటాక్‌కు ప్రయత్నించగా కూల్చేసినట్లు పేర్కొన్నాయి.