డ్రోన్ కెమెరాలో రికార్డైన.. నేపాల్ జల ప్రళయం

డ్రోన్ కెమెరాలో రికార్డైన.. నేపాల్ జల ప్రళయం

ఖాట్మాండు: నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో పెను విషాదం మిగిల్చిన ఆకస్మిక వరదలకు సంబంధించిన దృశ్యాలు డ్రోన్ కెమెరాలో అనుకోకుండా రికార్డయ్యాయి. సముద్ర మట్టానికి సుమారు 7,200 మీటర్ల ఎత్తులోని లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం వద్ద భారీ హిమానీనదం (గ్లేసియర్), కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటాన్ని ఓ చైనా ఫొటోగ్రాఫర్ తీసిన డ్రోన్ దృశ్యాలు స్పష్టంగా చూపించాయి. హిమపాతం, కొండచరియలు విరిగిపడటంతో కొండల నుంచి భారీగా దుమ్ము, ధూళి ఎగసిపడ్డాయి. ఆ తర్వాత దాదాపు 1,200 మీటర్ల దిగువన ఉన్న లోయలోకి మంచు, రాళ్లు, బురద భారీ ఎత్తున పడిపోయాయి. దీని ప్రభావంతో భోటే కోశీ, త్రిశూలి నదులకు ఆకస్మిక వరదలు వచ్చాయి.