లండన్‌కు బయలుదేరిన భారత రాష్ట్రపతి

లండన్‌కు బయలుదేరిన భారత రాష్ట్రపతి

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 19న ఎలిజబెత్ 2 అంత్యక్రియలు జరగనుండగా.. భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి లండన్‌కు వెళ్లారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సెప్టెంబర్ 12నే ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి భారత్‌ తరఫున సంతాపాన్ని తెలియజేశారు. 

క్వీన్ ఎలిజబెత్ 2  మృతికి సంతాప సూచకంగా  భారతదేశం సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినం నిర్వహించింది. సెప్టెంబర్ 8న  96 ఏళ్ల వయసులో వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ ఎలిజబెత్ 2 కన్నుమూశారు.  వెస్ట్‌మినిస్టర్ అబేలో రాణి అంత్యక్రియలు జరగనున్నాయి.