రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో డీసీఏ సోదాలు

రాష్ట్రంలోని మెడికల్  షాపుల్లో డీసీఏ సోదాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్  షాపుల్లో అక్రమంగా అమ్ముతున్న మత్తుమందుల అమ్మకాలపై డ్రగ్  కంట్రోలింగ్ అధికారులు కొరడా ఝుళిపించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్  షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రూల్స్ కు విరుద్ధంగా మందులను విక్రయిస్తున్న 63  దుకాణాలకు షోకాజ్  నోటీసులు జారీ చేశారు.

 డాక్టర్  ప్రిస్క్రిప్షన్  లేకుండా మందులు అమ్మడం, మందులు అమ్మిన బిల్లులు చూపించకపోవడం, రిజిస్టర్  ఫార్మసిస్ట్  లేకుండానే షాపులు నిర్వహించడం, డ్రగ్  రిజిస్టర్లను మెయింటెన్  చేయకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు డీసీఏ అధికారులు గుర్తించారు.