డిస్కౌంట్లకు మందులు కొంటున్నారా? ..జాగ్రత్త

డిస్కౌంట్లకు మందులు కొంటున్నారా? ..జాగ్రత్త

హైదరాబాద్ లో  నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమల్ హాసన్ రెడ్డి  హెచ్చరించారు. ఉత్తర ఖాండ్, హిమాచల్ ప్రదేశ్ లో నకిలీ మందులు తయారు చేసి హైదరాబాద్ అమ్ముతున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్ , ఎజెంట్ల ద్వారా హైదరాబాద్ కు  దిగుమతి చేస్తున్నారని చెప్పారు. నకిలీ మందులను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే మెడికల్ షాపులు మందులు విక్రయించాలని చెప్పారు. రాష్ట్రంలో 42 వేల మెడికల్ షాప్ లు ఉన్నానయని..  ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడటం డ్రగ్ కంట్రోల్ తరపున  తమదే బాధ్యతన్నారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. 

గత 6 నెలల నుండి నకిలీ మందులపై నిఘా పెంచి.. నకిలీ మెడిసిన్ ఇంజక్షన్స్ సీజ్ చేశామన్నారు డీజీ కమల్ హాసన్ రెడ్డి.   నకిలీ మందులు తయారు చేసే కంపెనీల యూనిట్స్ పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెడికల్ షాప్ లపై ఫోకస్ పెట్టామని.. 6 నెలల్లో తనిఖీలు చేశాం..ఆగస్టు నుండి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి నకిలీ మందులు, కొరియర్ ద్వారా బ్రాండెడ్ మందులు వస్తున్నాయని చెప్పారు.  రోడ్డు రవాణా ద్వారా కొరియర్ చేస్తున్నారని తెలిపారు.  అలాంటి ముఠాలను పట్టుకున్నామన్నారు.   ప్రజలు నకిలీ మందులను గుర్తించాలని కోరారు. డ్రగ్ కంట్రోల్ కి వెబ్ సైట్ ఉందని.. టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని కోరారు.