కరీంనగర్ లో ఏసీబీకి చిక్కిన డ్రగ్ కంట్రోల్ అధికారులు

కరీంనగర్ లో ఏసీబీకి చిక్కిన డ్రగ్ కంట్రోల్ అధికారులు

కరీంనగర్​ జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మెడికల్​ షాపు లలో తనిఖీలకోసం వచ్చిన డ్రగ్స్​కంట్రోల్​అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బాధితుడి నుంచి లంచం డిమాండ్​ చేసిన డ్రగ్స్​ కంట్రోల్​ అధికారులు రెడ్​ హ్యాండెడ్​ గా ఏసీబీ అధికారులకు దొరికారు.. వివరాల్లోకి వెళితే.. 

 కరీంనగర్​ పట్ణణంలోని విజేత హాస్పిటల్​మెడికల్​ షాపులో మంగళవారం (అక్టోబర్​ 7) తనిఖీలునిర్వహించారు కరీంనగర్​ జిల్లా డ్రగ్స్​ కంట్రోల్​ అధికారులు. షాపు నిర్వాహకుడినుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా డ్రగ్స్​  కంట్రోల్​ అడ్మినిస్ట్రేషన్​ లో పనిచేస్తున్న  డ్రగ్​ కంట్రోల్​ అసిస్టెంట్​ డైరెక్టర్​ మర్యాల శ్రీనివాస్, డ్రగ్​ ఇన్ స్పెక్టర్​ కార్తీక్​ భరద్వాజ్​ తోపాటు, ప్రైవేట్​ పర్సన్​ రాము ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​ గా దొరికారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్​ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు అధికారులు.