
శంషాబాద్, వెలుగు : డ్రగ్స్ స్థావరాలపై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి సుమారు రూ. కోటి 73 లక్షల విలువైన మత్తు పదార్థాలు సీజ్ చేసిన ఘటన మైలర్ దేవ్ పల్లి పీఎస్ పరిధి బాబుల్ రెడ్డి నగర్ లో జరిగింది. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దశరథ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ ఆధ్వర్యంలో దాడి చేసి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ పోలీసులు గురువారం బాబుల్ రెడ్డినగర్ లో డ్రగ్స్ తయారీ కేంద్రాలపై దాడి చేశారు.
ఇందులో భాగంగా 27 కేజీల ఓపీవో పాపి పౌడర్, 11 కేజీల ఓపీఓ స్ట్రా హస్క్, 1000 కేజీల టొబాకో ఓపీఓ మిక్సర్ తో పాటు బొలెరో వెహికల్, 10 సెల్ ఫోన్ సీజ్ చేసినట్లు డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్ తెలిపారు. డ్రగ్స్ తయారీ నిర్వాహకుడిపై ఎన్ డీపీఎస్ఆర్టీ కింద కేసు నమోదు చేశారు. ఈ దాడిలో శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హరిప్రియ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ దేవేందర్ రావు, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పలువురు ఎస్ ఐలు తదితరులు పాల్గొన్నారు.