సెక్స్ రాకెట్ లో భార్య భర్తలు

సెక్స్ రాకెట్ లో భార్య భర్తలు

మొదట్లో సెక్స్ రాకెట్ నడిపి..తర్వాత డ్రగ్స్ సప్లయర్లుగా మారిన భార్యాభర్తలను ఎక్సైజ్ ఎన్​ఫోర్స్ మెంట్ పోలీసులు సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నం.12లో అరెస్టు చేశారు.  మంగళవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి చెప్పారు.

షేక్ ఫహాద్ దందా…

బంజారాహిల్స్ రోడ్ నం.12 లోని సాయిబాబా టెంపుల్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతున్నారని సమాచారంతో  ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు జరిపారు. ఈ దాడుల్లో టోలిచౌకీకి చెందిన షేక్ ఫహాద్ అలియాస్ మదన్(37) సలీమ రబ్బిల్ షేక్(27) అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఫహాద్ 8 ఏళ్ళ క్రితం  తన భార్య సలీమ రబ్బిల్ షేక్ తో కలిసి హైదరాబాద్ కి వచ్చాడు. షేక్ ఫహాద్ బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో యువతులతో సెక్స్ రాకెట్ నడిపేవాడు. ఈ క్రమంలో గతేడాది జనవరిలో ఫహాద్ ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఫహాద్ తన నివాసాన్ని ఫిల్మ్ నగర్ రోడ్ నం.5 కు మార్చాడు. తను రెంట్ కి ఉండే ఇంటికి నెలకు రూ.75 వేలు చెల్లిస్తూ సెక్స్ రాకెట్ నడిపేవాడు.

నైజీరియన్లతో దోస్తానీ…

ఈ దందాలో తన వద్దకు వచ్చే కస్టమర్లు డ్రగ్స్ తో వచ్చేవారు. దీంతో సెక్స్ రాకెట్ తో పాటు డ్రగ్స్ సప్లయ్ కూడా చేస్తే ఎక్కువ సంపాదించవచ్చని షేక్ ఫహాద్ ప్లాన్ చేశాడు. ఇందుకోసం సన్ సిటీలోని ఓ నైజీరియన్ తో  ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది డిసెంబర్ నుంచి కొకైన్ కొనుగోలు చేసి తన కస్టమర్లకు అమ్మేవాడు. గ్రాము కొకైన రూ.6 వేలకు కొని రూ.7500కు అమ్మేవాడు. ఇలా తన భార్య సలీమ రబ్బిల్ షేక్ తో కలిసి ఓ వైపు సెక్స్ రాకెట్ నడుపుతూ.. మరోవైపు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు. టోలిచౌకీకి చెందిన సంతోష్, మహ్మద్ మసూద్ లతో డ్రగ్స్ సప్లయ్ చేయిస్తున్నాడు.

ఈ నెల 2న ఇద్దరి ముఠా సభ్యుల అరెస్ట్…

ఈ నెల 2న ఫహాద్ గ్యాంగ్ ఫిల్మ్ నగర్ లో రోడ్ నం.5లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు జరిపిన ఎక్సైజ్ పోలీసులు సంతోష్ ,మహ్మద్ మసూద్ లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 గ్రాముల కొకైన్, 2 గ్రాముల ఒపీయం,రూ.1.13 లక్షల డబ్బు, 3 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇది గమనించిన ఫహాద్ తన ఐ ట్వంటీ కారులో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత సంతోష్ ,మహ్మద్ మసూద్ ను అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
ఇందులో భాగంగా ఫహాద్,సలీమ రబ్బిల్ షేక్ సోమవారం బంజారాహిల్స్ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ దాడులు జరిపిన ఎక్సైజ్ పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి 9 గ్రాముల కొకైన్, రూ.3లక్షల డబ్బు, 2 కార్లు, 4 సెల్​ఫోన్లతో పాటు స్వైపింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.