మత్తుమందుల దందాపై సమాచారం ఇవ్వండి..ప్రజలకు డీసీఏ పిలుపు

మత్తుమందుల దందాపై సమాచారం ఇవ్వండి..ప్రజలకు డీసీఏ పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరిగిపోతున్న మత్తుమందుల దందాను అరికట్టేందుకు ప్రజలే ముందుకు రావాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) పిలుపునిచ్చింది. చుట్టుపక్కల ఏం జరిగినా ఫోన్ కాల్‌‌‌‌‌‌‌‌ లో చెప్పాలని.. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తుంది. ప్రజారోగ్యాన్ని కాపాడే యుద్ధంలో పౌరులే కీలకమని బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘మీ పరిసరాల్లో..జనావాసాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఎక్కడైనా మత్తు మందులు తయారు చేస్తున్నా, డాక్టర్ చీటీ లేకుండా అబార్షన్ కిట్స్, నిద్రమాత్రలు వంటివి అమ్ముతున్నా, ఇతర అనుమానాస్పద యాక్టివిటీస్ కనిపించినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి” అని డీసీఏ కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టమైన హామీ ఇచ్చింది. అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు1800-599-6969 టోల్- ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేయవచ్చని సూచించింది.