ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ తో నకిలీ మందుల తయారీ..

ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ తో నకిలీ మందుల తయారీ..

హైదరాబాద్ :  ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ తీసుకుని నకిలీ మందుల తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ గుట్టు రట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కూకట్ పల్లి మూసాపేట్ లో నకిలీ మందుల తయారీ దందా వెలుగు చూసింది. పక్క సమాచారంతో ఈరోజు ఉదయం రాజీవ్ గాంధీ నగర్ లోని రామ్స్ ఫార్మసిటికల్ కంపెనీపై అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా తయారుచేస్తున్న అల్సర్ మెడిసిన్ లకు సంబంధించి మందులను అధికారులు సీజ్ చేశారు.

 ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ తీసుకొని డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ మందులను తయారు చేస్తున్న  ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ లో బయోమెడికల్ ఫార్మసిటికల్ పేరిట విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిజామాబాదులో ఆరు లక్షల రూపాయల విలువచేసే 29,600 క్యాప్సిల్స్ ను గుర్తించినట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.