చాక్లెట్ క్యాప్సూల్స్లో డ్రగ్స్.. చెన్నై ఎయిర్ పోర్టులో రూ.56 కోట్ల కొకైన్ సీజ్

చాక్లెట్ క్యాప్సూల్స్లో డ్రగ్స్.. చెన్నై ఎయిర్ పోర్టులో రూ.56 కోట్ల కొకైన్ సీజ్

ఇండియాలోకి డ్రగ్స్ను భారీగా డంప్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్మగ్లర్లు. టూరిస్టు వీసాలపై వచ్చి.. ఇండియాలో డ్రగ్స్ ను సరఫరా చేస్తూ పెద్ద రాకెట్ నడుపుతున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 03) చెన్నై ఎయిర్ పోర్టులో కోట్ల విలువైన కొకైన్ పట్టుబడటం షాకింగ్ కు గురి చేసింది. 

చెన్నై ఎయిర్ పోర్టులో మంగళవారం కస్టమ్స్, నార్కోటిక్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో రూ. 56 కోట్ల విలువైన 5.6 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఓ నైజీరియన్ యువకుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వచ్చిన ఫ్లైట్ లో స్మగ్లర్లు పట్డుబడ్డారు. 

ఇటీవల టూరిస్టు వీసాపై వెళ్ళి తిరిగి వచ్చిన ఇద్దరు నార్త్ ఇండియన్స్ పై నిఘా పెట్టారు కస్టమ్స్ అధికారులు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా స్మగ్లింగ్ వ్యవహారం  బయటపడింది. చాక్లెట్ క్యాప్సుల్స్ రూపంలో కొకైన్ స్మగ్లింగ్ చేస్తుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

తాము ఇంటర్నేషనల్ స్మగ్లర్లకు సరుకు రవాణా మాత్రమే చేస్తామని విచారణలో స్మగ్లర్లు  వెల్లడించారు. వారి సమాచారంతో ఓ నైజీరియన్ తో పాటు మరో డ్రగ్స్ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు సెంట్రల్ నార్కోటిక్ అధికారులు.