రాజేంద్రనగర్లో డ్రగ్స్ స్వాధీనం.. కంటోన్మెంట్లో ముగ్గురు అరెస్ట్..

రాజేంద్రనగర్లో డ్రగ్స్ స్వాధీనం.. కంటోన్మెంట్లో ముగ్గురు అరెస్ట్..

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్‌‌‌‌ ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు గురువారం జాయింట్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ నిర్వహించి ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి సంతోష్, సందీప్, శివకుమార్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ తీసుకువచ్చారు. రాజేంద్రనగర్​లో వాటిని కొనేందుకు సాయిబాబు, విశాల్‌‌‌‌రెడ్డి, సమీర్​ రాగా.. ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. రూ.2 లక్షల 18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కంటోన్మెంట్​లో ముగ్గురు అరెస్ట్​..

కంటోన్మెంట్: బొల్లారం ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్న భరత్​, ఉమేశ్​, శశికాంత్​ను డీటీఎఫ్ సీఐ సౌజన్య ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిందితుల వద్ద 3.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

డ్రగ్స్‌‌‌‌ సేవించి వ్యక్తి మృతి..

గండిపేట: అధిక మోతాదులో డ్రగ్స్‌‌‌‌ తీసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. శివరాంపల్లికి చెందిన అహ్మద్‌‌‌‌ అలీ బుధవారం రాత్రి ఫ్రెండ్స్​ కలిసి పార్టీ చేసుకొని డ్రగ్స్‌‌‌‌ అధికంగా తీసుకున్నాడు. దీంతో అతడు మృతిచెందాడు. మరో ఇద్దరికి పోలీసులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌‌‌‌ వచ్చింది. ఎన్‌‌‌‌డీపీఎస్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.