
పీకల దాకా తాగాలి...ఎవరో ఒకరితో గొడవ పడాలి..అర్థరాత్రిళ్లు ఒళ్లు మరిచి రోడ్లపై హంగామా సృష్టించాలి ప్రస్తుతం ఇదో ట్రెండ్ అయిపోయింది. అయితే ఇన్నాళ్లు తాగుబోతులే సోయి లేకుండా తాగి రోడ్లపై రెచ్చిపోవడం చూశాం. కానీ తాజాగా అమ్మాయిలు సైతం ఫుల్గా తాగి రోడ్లపై వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ముగ్గురు అమ్మాయిలు నానా యాగి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ముగ్గురు మహిళలు మద్యం మత్తులో రెచ్చిపోయారు. మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న యువతులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు..వారిని ఇండ్లకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన యువతులు..పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనను ఓ మహిళా కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా...ఆ ఫోన్ ను తీసుకుని నేలకేసి కొట్టారు.
ఈ ఘటనను స్థానికులు కూడా వీడియో తీస్తుండగా..వారిపై కూడా యువతులు దాడి చేశారు. అనంతరం ఘటనా స్థలానికి ఓ మహిళా పోలీసు అధికారి వచ్చారు. అనంతరం ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. యువతుల కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు..వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు.