దాసరి అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాష్ డ్రైవింగ్.. నాలుగు బైకులు ధ్వంసం

V6 Velugu Posted on Jan 21, 2022

  • తాగిన మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. నాలుగు బైకులు ధ్వంసం
     

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తాగిన మత్తులో కారు డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి నాలుగు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ధ్వంసం చేసిన దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12 రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా దాసరి అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి బయలుదేరాడు. తాగిన మత్తులో ర్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న బైకులను ఢీ కొట్టాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దీంతో గురువారం ఉదయం పోలీసుల ముందు హాజరైన అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనలైజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అందులో బీఏసీ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 405 ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు కావడంతో ఆయనపై డ్రంకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు పెట్టారు.

Tagged Hyderabad, drunken drive, Dasari Arun, Drunken drive case

Latest Videos

Subscribe Now

More News