డ్రై ఫ్రూట్స్​  మస్తు తింటున్నరు

డ్రై ఫ్రూట్స్​  మస్తు తింటున్నరు
  • ఫుల్​ డిమాండ్​.. సేల్స్ డబుల్
  • గ్రేటర్​లో సుమారు వెయ్యి స్పెషల్​ స్టోర్లు
  • డైలీ 40 కిలోల నుంచి 500 కిలోల వరకు అమ్మకాలు

హైదరాబాద్, వెలుగు:  కరోనా ఎఫెక్ట్ తర్వాత సిటిజన్ల ఫుడ్ ​హ్యాబిట్స్​లో మార్పులు వచ్చాయి. చాలామంది  ​హెల్దీ ఫుడ్​పై  ఫోకస్​ చేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తింటున్నారు. దీంతో గ్రేటర్​లో వీటి అమ్మకాలకు ఫుల్ డిమాండ్ వచ్చింది. డైలీ ఒక్కో స్టోర్​ నుంచి 40 కిలోల నుంచి  సుమారు500 కిలోల  వరకు డ్రై ఫ్రూట్స్​అమ్ముడవుతున్నాయి.  స్టోర్​లో అమ్మకాలతో పాటు ఇతర ప్రాంతాలకు ఎక్స్ పోర్టు చేసిన వాటితో కలిసి డైలీ దాదాపు రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోందని వ్యాపారులు చెప్తున్నారు.  ఇమ్యూనిటికీ కోసం సిటిజన్లు డ్రైఫ్రూట్స్​తినడమే సేల్స్ పెరగడానికి కారణమంటున్నారు.   రెండేళ్లలో పెరిగిన షాప్​లు
గతంలో డ్రై ఫ్రూట్స్​ని కేవలం కిరాణ షాపుల్లో అమ్మేవారు. బేగంబజార్, ఉస్మాన్ గంజ్​ మార్కెట్లలో హోల్ సేల్ అమ్మకాలు జరిగేవి. మూడేళ్లుగా డ్రై ఫ్రూట్లకు  డిమాండ్ ​పెరగుతుండటంతో గ్రేటర్​లో స్పెషల్ స్టోర్లు వచ్చాయి. రెండేళ్లలో   ఫుల్​ఇంటీరియర్​ డిజైన్​తో సిటీలో సుమారు వెయ్యికి పైగా డ్రై ఫ్రూట్​స్టోర్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో స్టోర్ కోసం రూ. 15 లక్షల నుంచి కోటికి పైగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నిర్వాహకులు 
చెప్తున్నారు.  కొందరు వ్యాపారులు సిటీలోని పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 బ్రాంచ్​లను నడిపిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,  ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, రామంతాపూర్, మెహిదీప్నటం, కూకట్​పల్లి, ఉప్పల్.. ఇలా చాలా ఏరియాల్లో స్టోర్స్ ఉన్నాయి. శివారు ప్రాంతాలైన బండ్లగూడ జాగీర్, బోడుప్పల్‍, మేడిపల్లి, బండంగ్​పేట, శంషాబాద్‍, ఘట్ కేసర్​లోనూ  స్టోర్స్  ఉన్నాయి.  

క్వాలిటీ ఆధారంగా రేట్లు..
బాదం, కాజు, ఎండు ఖర్జురా,  పిస్తాను ఎక్కువగా కొంటున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. క్వాలిటీ ఆధారంగా డ్రై ఫ్రూట్స్ రేట్లు ఉన్నాయంటున్నారు. కాజు కిలో రూ.740 నుంచి రూ.1600,  బాదం రూ.650 నుంచి రూ.4,800 వరకు ఉండగా, అంజూర్ రేటు రూ.800 నుంచి 2 వేలకు పైగా ఉంది. ఆక్రూట్ రూ.900 నుంచి  రూ.2,100,  కిలో పిస్తాను రూ.1200 నుంచి రూ.2,200 మధ్య అమ్ముతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో అత్యధికంగా చిల్గోజా రేటు కిలో 7 వేలకు పైగా ఉన్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. 

4 నెలల క్రితమే స్టోర్ ఓపెన్ చేశా
  డ్రై ఫ్రూట్స్​కు డిమాండ్ పెరగడంతో 4 నెలల క్రితమే నా ఫ్రెండ్​తో కలిసి కొత్తగా స్టోర్ ఓపెన్ చేశా. అన్ని రకాల డ్రై ప్రూట్స్ అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం సేల్స్ బాగున్నాయి.  
- రమాకాంత్, డ్రై ఫ్రూట్స్ స్టోర్​ ఓనర్​, బంజారాహిల్స్

లిమిటెడ్​గా తింటే బెటర్
 ఇమ్యూనిటీ కోసం డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తింటున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ డ్రైఫ్రూట్స్ తినడం మంచిదే కానీ లిమిటెడ్​గా తీసుకుంటే బెటర్.  మరీ ఎక్కువగా  తింటే  ఒబెసిటీ వచ్చే చాన్స్ ఉంది.  ఒక పూటకి ఎంత అవసరమో అంతే తినాలి. బాదం, కిస్ మిస్ తినడం హెల్త్ కి మంచిది.   
- డాక్టర్ విజయ్‍ భాస్కర్, ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ చైర్మన్