
ఎక్స్‌రే చూసిన వెంటనే వ్యాధిని గుర్తించాలంటే డాక్టర్‌కు ఎంతో అనుభవం ఉండాలి. కానీ.. ఏఐ కొన్ని సెకన్లలో వ్యాధి ఏంటనేది చెప్పేసింది. అందుకే దుబాయ్‌కి చెందిన ఒక పల్మనాలజిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోలో ‘నేను ఉద్యోగం కోల్పోయిన తర్వాత మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేయాల్సి వస్తుందేమో’ అని చమత్కరించాడు.
డాక్టర్ మొహమ్మద్ ఫౌజీ కత్రాంజీ 18 సంవత్సరాలుగా పల్మోనాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు.. ఆయన క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్‌లో ఎక్స్పర్ట్. ఏఐ కూడా తనలాగే రోగుల సమస్యలను గుర్తించగలదా? అని తెలుసుకోవడానికి ఆయన ఒక ఎక్స్‌రేని స్టడీ చేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించాడు. ఒక కాంప్లికేటెడ్ చెస్ట్ ఎక్స్-రేను అది అచ్చం ఒక ఎక్స్పర్ట్లాగే విశ్లేషించి పేషెంట్‌కు న్యుమోనియా ఉందని చెప్పేసింది. అందుకే ఏఐ వల్ల తాను కూడా భవిష్యత్తులో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని ఆ వీడియోలో చెప్పాడు ఫౌజీ.