చనిపోయిన రైతు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం రూ.లక్ష

చనిపోయిన రైతు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం రూ.లక్ష

సిద్దిపేట : దుబ్బాక పట్టణంలో యూరియా కోసం లైన్ లో నిల్చుని రైతు ఎల్లయ్య ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన రైతు.. ఈ ఉదయం గురువారం పొద్దున్నే వచ్చి యూరియా కోసం లైన్ లో నిల్చున్నాడు. గంటల తరబడి నిలబడటంతో సొమ్మసిల్లి పడిపోయాడు. మిగతా వారు హాస్పిటల్ కు తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తంచేసింది.

బాధిత రైతు తన సొంత 2 ఎకరాలు, కౌలుకు తీసుకున్న మరో 2 ఎకరాలను సాగు చేసుకుంటున్నాడు. ఆయనకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు.

రైతు కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. అచ్చుమాయిపల్లిలో బాధిత రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రూ.లక్ష 25 వేల ఆర్థిక సహాయం అందజేశారు ఎమ్మెల్యే రామలింగారెడ్డి.

రైతు కుటుంబాన్ని పరామర్శించి.. రూ. పది వేల సహాయం చేశారు కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డి.