డుకాటి మల్టీస్ట్రడా వీ2 నుంచి.. రూ.18లక్షల 88వేల బైక్

డుకాటి మల్టీస్ట్రడా వీ2 నుంచి.. రూ.18లక్షల 88వేల బైక్

డుకాటి మల్టీస్ట్రడా వీ2  2025 వెర్షన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ బైక్‌‌‌‌‌‌‌‌లో  890సీసీ వీ -ట్విన్ ఇంజన్‌‌‌‌‌‌‌‌ అమర్చారు.  ఇది 115హెచ్‌‌‌‌‌‌‌‌పీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 92ఎన్‌‌‌‌‌‌‌‌ఎం టార్క్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేయగలదు.  పాత మోడల్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 18కేజీల తక్కువ బరువు కలిగి ఉంది.

 5 రైడింగ్ మోడ్‌‌‌‌‌‌‌‌లు, 5 ఇంచుల  టీఎఫ్‌‌‌‌‌‌‌‌టీ స్క్రీన్, క్రూజ్ కంట్రోల్, యూఎస్‌‌‌‌‌‌‌‌బీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీ2 బేస్‌‌‌‌‌‌‌‌ మోడల్ ధర రూ.18.88 లక్షలు, వీ2 ఎస్ వేరియంట్‌‌‌‌‌‌‌‌లో రెడ్ కలర్ అయితే  రూ.20.99 లక్షలు, గ్రీన్ కలర్ అయితే రూ.21.29 లక్షలు. డుకాటి మల్టీస్ట్రడా వీ2 సోమవారం నుంచి అన్ని డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లలో  అందుబాటులో ఉంది.