
మంత్రిగా దుద్దిళ్ల శ్రీదర్ బాబు ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
- మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రస్థానం మొదలైంది.
- 1969 సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని డివిజన్ లోని కాటారం మండలం ధన్వాడ లో శ్రీధర్ బాబు జన్మించారు.
- శ్రీపాదరావు- జయమ్మ లకు శ్రీధర్ బాబు 3 వ సంతానం
- శైలజ రామయ్యర్ (ఐఏఎస్) శ్రీధర్ బాబు సతీమణి
- 1992 నుండి 1995 వరకు శ్రీధర్ బాబు న్యాయవాద విద్యను అభ్యసించారు.
- 1998 లో ఏపీ హైకోర్టులో శ్రీధర్ బాబు న్యాయవాది వృత్తి చేశారు.
- 1999 సంవత్సరంలో తండ్రి స్వర్గీయ స్పీకర్ శ్రీపాదరావు హత్య అనంతరం శ్రీధర్ బాబు రాజకీయంలోకి ప్రవేశించారు.
- 1999 లో మంథని నియోజవర్గంలో టిడిపి అభ్యర్థి చందుపట్ల రాంరెడ్డిని ఓడించి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు.
- వరుసగా 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపొంది 2014 లో టిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు పై పోటీ చేసి అపజయం పాలయ్యారు.
- మళ్లీ 2018, 2023 లో శ్రీధర్ బాబు 5 వ సారి విజయం సాధించారు
- 2009 ప్రభుత్వ విఫ్,2010 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, పలు కీలక పదవులను పొందారు.