
రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఇలానే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా జూలై 26,27 తేదీల్లో (బుధ, గురు వారాల్లో) విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.