నేడు శ్రీలంక, బంగ్లా మ్యాచ్‌‌ జరిగేనా?

నేడు శ్రీలంక, బంగ్లా మ్యాచ్‌‌ జరిగేనా?

న్యూఢిల్లీ: వరల్డ్‌‌ కప్‌‌ మ్యాచ్‌‌కు వాయు కాలుష్యం అడ్డు తగిలేలా ఉంది. గత రెండో రోజులతో పోలిస్తే ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో  సోమవారం శ్రీలంక, బంగ్లాదేశ్‌‌ మ్యాచ్‌‌ జరగడంపై అనుమానాలు మొదలయ్యాయి. వాతావరణంలో మార్పు రాకపోతే మ్యాచ్‌‌ను నిర్వహణ సాధ్యమయ్యేటట్లుగా లేదు. కాలుష్యం వల్ల ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌‌ను రద్దు చేసుకున్నాయి.

సోమవారం ఉదయం పరిస్థితిని బట్టి మ్యాచ్‌‌ నిర్వహణపై రిఫరీ, అంపైర్లు నిర్ణయం తీసుకుంటారని ఐసీసీ స్పష్టం చేసింది.  కాగా, లంక, బంగ్లా ఇప్పటికే సెమీస్‌‌ రేసు నుంచి వైదొలిగాయి.