దుల్కర్ సల్మాన్ మిడిల్ క్లాస్ భాస్కర్

దుల్కర్ సల్మాన్ మిడిల్ క్లాస్ భాస్కర్

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రంజాన్ సందర్భంగా గురువారం టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. అతడొక సాధారణ వ్యక్తి... సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. ఈ బ్యాంక్‌‌కు అతనే కరెక్ట్.. లాంటి డైలాగ్స్‌‌తో క్యాషియర్‌‌‌‌గా దుల్కర్ పాత్రను పరిచయం చేశారు.  ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి... భారీ మొత్తంలో డబ్బును ఎలా సంపాదించాడు.. అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాలతో ఈ టీజర్‌‌‌‌ను కట్ చేశారు. ‘‘మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్.. మేమింతే, కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా ఖర్చు పెట్టేస్తాం సార్‌‌‌‌” అంటూ దుల్కర్ చెప్పిన డైలాగ్స్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.