
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఫార్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
తాజాగా మంగళవారం (ఆగస్ట్ 20న) ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. దీపావళి సందర్భంగా 2024 అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే, ముందుగా ఈ సినిమాని వినాయక చవితి స్పెషల్ గా (సెప్టెంబర్ 7న) సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించగా..ఇపుడు అక్టోబర్ 31 డేట్ లాక్ చేసుకుంది.
వినాయక చవితి నుండి పోస్ట్ఫోన్ చేయడానికి కారణం వివరిస్తూ .."ప్రతి భాషలో అక్కడి లోకల్ ఫ్లేవర్ రావడం కోసం డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నామని, ఇప్పటికిప్పుడు కంగారుగా సినిమాను తీసుకురావడం కంటే దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన రిలీజ్ చేయడం మంచిదని అప్పటికి వాయిదా వేశామని" ప్రకటించింది.
Postponing releases can impact social media reputation, but it's essential for our film's quality! ?#LuckyBaskhar is set to make your Diwali special in theaters worldwide. ??
— Sithara Entertainments (@SitharaEnts) August 20, 2024
Grand release on Oct 31st, 2024. #LuckyBaskharOnOct31st ?@dulQuer #VenkyAtluri @Meenakshiioffl… pic.twitter.com/cJCbFdeFr2
1980–90 నేపథ్యంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ లైఫ్ జర్నీని ఇందులో చూపించబోతున్నారు.ఇందుకోసం ఎనభైల నాటి ముంబై నగరానికి సంబంధించిన సెట్స్ వేశారు. అప్పటి బ్యాంక్‌లను పోలి ఉన్న సెట్స్‌లో ఎక్కువ భాగం షూటింగ్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. దుల్కర్ సల్మాన్‌కు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, శ్రీమతి గారు పాట ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.