Lucky Baskhar Teaser: ఒక్క రూపాయి మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం..మిడిల్ క్లాస్ మ్యాన్‌గా అదరగొట్టేసిన దుల్కర్..

Lucky Baskhar Teaser: ఒక్క రూపాయి మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం..మిడిల్ క్లాస్ మ్యాన్‌గా అదరగొట్టేసిన దుల్కర్..

సార్ సినిమాతో ధనుష్ (Danush)కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అంట్లూరి(Venky Atluri) డైరెక్షన్లో వస్తోన్న మూవీ లక్కీ భాస్కర్ (Lucky Baskhar).  సీతా రామమ్ (Sitha Ramam) సక్సెస్ తరువాత పాన్ ఇండియా లెవల్లో హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నుంచి వస్తోన్న డైరెక్ట్ తెలుగు మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. 1980ల కాలం నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. 

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ గా కనిపించనున్నాడు. తన పాత్రను మలిచిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో మేకర్స్ కట్ చేసిన టీజర్ హైప్ పెంచుతోంది. "మాది మిడిల్ క్లాస్ మెంటాలిటీ సర్. మేమింతే.. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి రూపాయి దాచుకుంటాం.పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం" అని దుల్కర్ చెప్పే డైలాగ్ మొత్తం టీజర్ కే హైలైట్ అని చెప్పొచ్చు.

ఒక మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి అయిన భాస్కర్ చాలా పొదుపు చేసే వ్యక్తి అని ఒక డైలాగ్ తోనే తన పాత్రలోని తీరును చూపించేశారు.ఇక అతను బ్యాంకులో రోజు డబ్బులు చూస్తూ ఉన్నప్పటికీ వాటిని అందుకోలేని పరిస్థితి.పైసా పైసా కూడా బెట్టుకునే లక్కీ భాస్కర్ కథ ఏంటి అనేది పూర్తిస్థాయిలో తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. 

హీరో చుట్టూరా..డబ్బు కట్టలు..మధ్యలో బ్యాంక్ ఉద్యోగిగా కళ్ళజోడు పెట్టుకొని, నీట్గా మధ్య పాపిడి తీసుకొని సూట్ కేసుతో నడుస్తూ దుల్కర్ నడిసొచ్చే తీరు ఆసక్తిగా ఉంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సాధారణ వ్యక్తి కథే లక్కీ భాస్కర్ అనే కథ విషయం అర్ధమవుతోంది. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. దుల్కర్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించనుంది.మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.