War 2: వార్ షురూ చేసిన యంగ్ టైగర్.. ఎన్టీఆర్ కొత్త లుక్ నెక్స్ట్ లెవల్!

War 2: వార్ షురూ చేసిన యంగ్ టైగర్.. ఎన్టీఆర్ కొత్త లుక్ నెక్స్ట్ లెవల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నారు. అందులో వార్ 2(War 2) ఒకటి. ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు ఎన్టీఆర్. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా చేస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. యష్ రాజ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నారు అని టాక్. 

అయితే చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా సెట్స్ లో తాజాగా అడుగుపెట్టాడు ఎన్టీఆర్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకున్న సమయంలో.. వార్ 2 లాంటి క్రేజీ ప్రాజెక్టును ఒకే చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఫ్యాన్స్ కూడా దేవర కంటే ఎక్కువ వార్ 2 కోసమే ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. వార్ 2 కోసం మరోసారి తిన్ లుక్ లోకి మారిపోయాడు ఎన్టీఆర్. నిన్నమొన్నటివరకు దేవర సినిమా కోసం కాస్త లావెక్కి కనిపించిన ఆయన.. ఇప్పుడు తిన్ అండ్ స్టైలీష్ లుక్ లో మారిపోయి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ కి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ పిక్ చూసిన నెటిజన్స్.. ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ వెేరియేషనా.. నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.