Siren OTT Official: ఓటీటీ ఫ్యాన్స్..క్రైమ్ సైరన్ మోత మోగడానికి సిద్ధం..ఎక్కడో తెలుసా?

Siren OTT Official: ఓటీటీ ఫ్యాన్స్..క్రైమ్ సైరన్ మోత మోగడానికి సిద్ధం..ఎక్కడో తెలుసా?

కోలీవుడ్ స్టార్ జయం రవి (Jayam Ravi) హీరోగా ఆంథోని భాగ్యరాజ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సైరన్’(Siren). కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌‌గా నటించారు. ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’అధినేత మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 16న తమిళంలో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక అక్కడ నెగిటివ్ టాక్ రావడంతో తెలుగులో థియేటర్లలో రిలీజ్ కాకుండానే..ఇపుడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి  రాబోతోంది. 

తాజాగా తెలుగు వెర్ష‌న్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) సైర‌న్ 108 మూవీని ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో జయం రవి మునుపెన్నడు లేని విధంగా కనిపించి మెప్పించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో సౌత్ కి చెందిన యాక్టర్స్ కూడా నటించడంతో ఓటీటీ ఫ్యాన్స్ సైరన్ మోత కోసం వెయిట్ చేస్తున్నారు. 

సైరన్ కథ:

సింపుల్గా చెప్పాలంటే పెరోల్ పై విడుదలైన ఖైదీ రివెంజ్ డ్రామా ఫిల్మ్ ఇది. త‌న భార్య మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌పై ఓ సాధార‌ణ అంబులెన్స్ డ్రైవ‌ర్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. అలాంటి క్రమంలో అతనికి ఎదురైనా సవాళ్లేంటీ?అనేది ఇంట్రెస్టింగ్ చూపించారు. ఇందులో తండ్రీకూతుళ్ల ఎమోష‌న్ తో పాటు పోలీస్‌, కిల్ల‌ర్ ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు..పై ఎత్తుల‌తో రివెంజ్ డ్రామాను అల్లుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించారు డైరెక్టర్.

  • Beta
Beta feature