కట్టుదిట్టమైన భద్రత నడుమ దుర్గాదేవికి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. నిన్న(సోమవారం) రాత్రి జరిపిన ట్రయిల్‌రన్ విజయవంతం కావడంతో.. ఇవాళ(మంగళవారం) సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. హంస వాహనం పై 32 మందికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. హంస వాహనం పైకి ఎక్కే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలని సూచించారు కమిషనర్ ద్వారకా తిరుమల రావు.

