ధర్మ పరిరక్షణకు దుర్గావాహిని మహిళా శక్తి సిద్ధం కావాలి : అఖిల భారత కన్వీనర్ ప్రగ్యా దీదీ

ధర్మ పరిరక్షణకు దుర్గావాహిని మహిళా శక్తి సిద్ధం కావాలి : అఖిల భారత కన్వీనర్ ప్రగ్యా దీదీ
  •     వీహెచ్​పీ దుర్గావాహిని అఖిల భారత కన్వీనర్ ప్రగ్యా దీదీ 
  •     పాతబస్తీలో యువతుల ర్యాలీ, ప్రదర్శన

హైదరాబాద్ సిటీ, వెలుగు: హిందూ ధర్మ పరిరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషించాలని వీహెచ్​పీ యువ మహిళా విభాగం దుర్గావాహిని అఖిల భారత కన్వీనర్ ప్రగ్యా దీదీ పిలుపునిచ్చారు. ఆదివారం పాతబస్తీలోని గౌలిపుర మిత్ర క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన హిందూ యువ మహిళల సమ్మేళనంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. 

అంతకుముందు వెయ్యి మంది దుర్గావాహిని కార్యకర్తలు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంతోపాటు పలు ప్రాంతాల్లో ర్యాలీ తీశారు. అనంతరం నిర్వహించిన సభలో కర్రసాము, కత్తియుద్ధ విన్యాసాలు, ఇతర ప్రదర్శనలు ఇచ్చారు. దుర్గావాహిని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం, రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి, పగడాకుల బాలస్వామి, అలివేలు మంగమ్మ, ప్రొఫెసర్ డాక్టర్ స్వప్నారెడ్డి, లలిత, కళ్లెం రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.