పండుగల పూట.. కరోనాతో జాగ్రత్త!

పండుగల పూట.. కరోనాతో జాగ్రత్త!

 ఇంట్లోనే చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన

తప్పనిసరై బైటికొస్తే జాగ్రత్తలు పాటించాలె

వచ్చే 2 నెలల్లో కరోనా వ్యాప్తి ఎక్కువన్నఐసీఎంఆర్

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు నెల ఆరు పండుగలను తీసుకొస్తోంది. అన్నీ ప్రధానమైనవే అవడంతో జనం ఎక్కువగా బయటకొచ్చే అవకాశముంది. గ్రేటర్ లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో అలర్ట్​గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ లో కేసులు మరింతగా పెరుగుతాయని ఐసీఎంఆర్ ఇప్పటికే హెచ్చరించడం కూడా సీరియస్ నెస్ ను తెలుపుతోంది.లాక్ డౌన్ మొదలు పండుగలన్నీ నిజారాడబరంగానే జరుగుతున్నాయి. మరికొన్ని రోజులు అలాగే సాదాసీదాగా ఇంట్లోనే జరుపుకొంటే మంచిదని నిపుణులు, మతపెద్దలు చెబుతున్నారు.

శనివారం బక్రీద్ పండుగ ఉండడంతో ముస్లింలు చాలామంది ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసుకున్నారు. కొందరు మాత్రమే మాల్స్​, షాపుల్లో కొనుగోలు చేశారు. హడావిడి లేకుండా పండుగ జరుపుకోవాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. ప్రార్థన మందిరాల్లోనూ ఫిజికల్ డిస్టె న్స్ పాటించాలని సూచించారు. పొట్టేళ్లను ప్రతి ఏడు మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ విక్రయించొద్దని, ప్రభుత్వం సూచించిన చోటే అమ్మాలని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. ఎక్కువ చోట్ల ఇదే ఫాలో అవుతున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్ల పక్కనే మందలు దింపుతున్నారు.

వరుసబెట్టి

ఆగస్టు 3న రక్షాబంధన్ ఉండగా, ఈసారి మాత్రం అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముళ్లు కలుసుకుని ఆప్యాయత పంచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎక్కువమంది ఆన్ లైన్ లోనే రాఖీలు కొని కొరియర్, పోస్ట్​లో అన్నాదమ్ముళ్లకు పంపిస్తున్నారు. దగ్గర్లో ఉంటే తప్ప.. జర్నీ వాయిదా వేసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చే కృష్ణా ష్టమి వేడుకులకు అనుమతి లేదు. ఎవరి కాలనీల్లో వారు అతి కొద్ది మంది మధ్య చేసుకోవాల్సి ఉంది. ఇండి పెండెన్స్ డే కూడా కొద్ది మంది మధ్యే జరపాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. 22 నుంచి 11రోజులపాటు నగరమంతా సాగే గణేష్ ఉత్సవాలనూ నిరాడంబరంగా చేసుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఏటా వేలల్లో ఉండే మండపాల సంఖ్య కూడా తగ్గే అవకాశముం ది. విగ్రహాల తయారీ కూడా తగ్గింది. ఆగస్ట్​లో చివరగా వచ్చే పండుగ మొహరాన్ని కూడా ఊరేగింపుల్లేకుండా జరుపుకోవాలని మత పెద్దలు భావిస్తున్నారు. ఈ వరుస పండుగల్లో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడం ఇప్పుడు చాలా ముఖ్యం . తప్పనిసరై బయటకొచ్చే వారు కొవిడ్ రూల్స్​పాటించాలి. ఫిజికల్ డిస్టె న్స్, మాస్క్​మస్ట్. అలయ్ బలయ్ ల జోలికి వెళ్లొద్దు . అలా ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని అధికారులు చెప్తున్నారు.